రాజధాని వానరాలకు ఐడీలు

Unique IDs for monkeys

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వానరాలకు ఇక విశిష్ట గుర్తింపు కార్డులు రానున్నాయి. కోతుల జనాభా విచ్చలవిడిగా పెరగడాన్ని నియం‍త్రించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. కోతుల స్టెరిలైజేషన్‌ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేయాలని ఎన్‌జీవో వైల్డ్‌ లైఫ్‌ ఎస్‌ఓఎస్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అటవీ శాఖలను కోరింది.

కోతుల సంఖ్యను నిరోధించేందుకు వాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌లో భాగంగా వాటికి శాశ్వత, విశిష్ట గుర్తింపు సంఖ్యలను (ఐడీ) ఇవ్వాలని ఎన్‌జీవో వైల్డ్‌లైఫ్‌ ఎస్‌ఓఎస్‌ సూచించింది. ఈ సంస్థ గతంలో ఆగ్రా డెవలప్‌మెంట్‌ అథారిటీతో కలిసి ఈ తరహా ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ ప్రాజెక్టును ఢిల్లీలో అమలు చేసేలా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను నవంబర్‌ 7కు వాయిదా వేసింది.

Read latest News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top