‘పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయండి’

YSRCP MPs Attend All Party Meeting In Parliament Library Building - Sakshi

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 9 అంశాలను లేవనెత్తిన వైఎస్సార్‌ సీపీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోమారు కేంద్రానికి విఙ్ఞప్తి చేసింది. అదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ గ్రాంట్లను విడుదల చేయాలని కోరింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ​గురువారం జరుగుతున్న అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి సహా పలువురు విపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వైఎస్సార్‌ సీపీ తొమ్మిది అంశాలను లేవనెత్తింది.

‘‘రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన 18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలి. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 3, 283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేయాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55, 548 కోట్లను ఆమోదించాలి. రాజధాని నగర అభివృద్ధి కోసం గ్రాంట్‌గా రూ. 47, 424 కోట్లు ఇవ్వాలి. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలి’’ అని వైఎస్సార్‌ సీపీ కేంద్రానికి విఙ్ఞప్తి చేసింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top