‘మీ పిల్లలను డాక్టర్లు చేస్తారా లేక కాపలాదారులా?’

You Want See Your Children's As Docters Or Choukidar"s - Sakshi

ఢిల్లీ: ‘మీ పిల్లలను డాక్టర్లను చేస్తారా లేక కాపలాదారులను చేస్తారా’ అని ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓటర్లను ప్రశ్నించారు. ‘‘మోదీ ఈ దేశాన్ని కాపలాదార్లతో నింపేయాలనుకుంటున్నారు. మీరు మీ పిల్లలను కాపలాదారులను చేయాలనుకుంటే మోదీకి ఓటేయండి. మీ పిల్లలకు సరైన విద్యతో డాక్టర్లు, ఇంజినీర్లను చేయాలనుకుంటే చదువుకున్న, నిజాయితీ గల ఆప్‌కు ఓటేయాలి’’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

రఫేల్‌ స్కాంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ.. ఆయన ‘చౌకీదార్‌’ కాదు.. చోర్‌ (దొంగ) అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా బీజేపీ #నేనూ కాపలాదారునే (మే భీ చౌకీదార్‌) అని ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీ సహా  కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు ట్విటర్‌లో తమ పేర్లకు ముందు చౌకీదార్‌ అని చేర్చుకున్నారు. దీనిపై విపక్ష కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అటు నెటిజన్లు కూడా బీజేపీ చౌకీదార్‌ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top