ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ 24 ఏళ్ల వివాహితపై మోడీనగర్కు చెందిన ఓ వ్యాపారి అత్యాచారం చేశాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాల పర్వానికి అడ్డుకట్ట పడటంలేదు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ 24 ఏళ్ల వివాహితపై మోడీనగర్కు చెందిన ఓ వ్యాపారి అత్యాచారం చేశాడు. 15 రోజుల క్రితం తన సిమెంటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని సదరు వ్యాపారి తనను పిలిచాడని, తీరా వెళ్లిన తర్వాత అతడు ఫ్యాక్టరీ గోడౌన్లోకి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అంతేకాక, ఆ సమయంలో వీడియో కూడా తీశాడని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయంటూ వీడియో చూపించి అతడు బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మోడీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.