breaking news
job pretext
-
ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. స్కూల్లో గ్యాంగ్‌రేప్
స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి.. ఇద్దరు వ్యక్తులు ఓ అమ్మాయిపై పాఠశాల ఆవరణలోనే సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. ఇళ్లలో పనిమనిషిగా పనిచేసే ఓ యువతి (17)కి నిందితుల్లో ఒకరైన స్క్రాప్ డీలర్ ఏడాది నుంచి తెలుసు. అతడు ఆమెకు ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆ స్కూలులోకి తీసుకెళ్లాడు. స్కూలు సెక్యూరిటీ గార్డు అతడికి బాగా తెలిసున్నవాడు కావడంతో.. లోపలకు వెళ్లడానికి కూడా వాళ్లకు ఎలాంటి అడ్డు లేకపోయింది. తాను ఓ టీచర్‌ను తీసుకొస్తానని, ఆయనే ఇంటర్వ్యూ చేస్తారని చెప్పి ఆఫీసు గది వద్ద ఉండాలని అతడు చెప్పాడు. పావుగంట తర్వాత సెక్యూరిటీ గార్డుతో తిరిగొచ్చి, గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. గట్టిగా అరిచేందుకు ప్రయత్నించగా వాళ్లు పారిపోయారు. తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆమె.. తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. దాంతో ఇద్దరూ కలిసి జగత్‌పురి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. యువతిని వైద్య పరీక్షలకు పంపి, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. మరోవైపు, ఢిల్లీలోనే పంజాబీబాగ్ ప్రాంతంలో 13 ఏళ్ల అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. స్వీట్లు, చాక్లెట్లు ఇస్తానని మభ్యపెట్టి తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ అతడు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని.. వ్యాపారి అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాల పర్వానికి అడ్డుకట్ట పడటంలేదు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ 24 ఏళ్ల వివాహితపై మోడీనగర్‌కు చెందిన ఓ వ్యాపారి అత్యాచారం చేశాడు. 15 రోజుల క్రితం తన సిమెంటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని సదరు వ్యాపారి తనను పిలిచాడని, తీరా వెళ్లిన తర్వాత అతడు ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక, ఆ సమయంలో వీడియో కూడా తీశాడని, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయంటూ వీడియో చూపించి అతడు బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మోడీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు.