శశికళ రిసార్టుకు ఎందుకు వెళ్లారు: సెల్వం | why did you go to golden bay, paneer selvam questions sasikala | Sakshi
Sakshi News home page

శశికళ రిసార్టుకు ఎందుకు వెళ్లారు: సెల్వం

Feb 12 2017 9:08 PM | Updated on Sep 5 2017 3:33 AM

శశికళ రిసార్టుకు ఎందుకు వెళ్లారు: సెల్వం

శశికళ రిసార్టుకు ఎందుకు వెళ్లారు: సెల్వం

అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళను మీడియా ద్వారా తానొక ప్రశ్న వేయాలనుకుంటున్నానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు.

చెన్నై: అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి శశికళను మీడియా ద్వారా తానొక ప్రశ్న వేయాలనుకుంటున్నానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. ఎమ్మెల్యేలను దాచిన గోల్డెన్ బే రిసార్టుకు ఎందుకు వెళ్లారని శశికళను ప్రశ్నించారు. పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేస్తున్నారని చెప్పారు. రిసార్టు నుంచి బయటకు రానీకుండా ఒక్కో ఎమ్మెల్యే దగ్గర ముగ్గురు గుండాలను పెట్టారని వారు చెబుతున్నారని వెల్లడించారు.

కేవలం పార్టీ సభ్యులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా శశికళ తమిళనాడు సీఎంగా ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా అమ్మ తనకు అండగా నిలిచిందని చెప్పారు. అమ్మని ఆఖరి చూపు చూసేందుకు కూడా దీపను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. శశికళ మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో తమ బలం రుజువు చేసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement