బాబోయ్‌ అక్కడ దయ్యాలు తిరుగుతున్నాయా! | Where 11 Of Family Were Found Hanging Now It Is A Diagnostics Centre In Delhi | Sakshi
Sakshi News home page

డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో దయ్యాలు తిరుగుతున్నాయా!

Dec 30 2019 1:17 PM | Updated on Dec 30 2019 2:19 PM

Where 11 Of Family Were Found Hanging Now It Is A Diagnostics Centre In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో దయ్యాలు సంచరిస్తున్నాయన్న వదంతులు స్థానికులను బెంబెలెత్తిస్తున్నాయి. గతేడాది డిల్లీలోని ఓ ఇంట్లో 11 మంది సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఇంట్లో మోహన్‌ సింగ్‌ అనే డాక్టర్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ నడిపిస్తున్నాడు. కాగా, గత కొన్నిరోజులుగా ఆ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ఆ ఇంట్లో చనిపోయినవారి ఆత్మలు తిరుగుతున్నాయంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే ల్యాబ్‌ యాజమాని మాత్రం ఆ వార్తలను కొట్టిపారేసారు.  

ల్యాబ్‌ యాజమాని మాట్లాడుతూ.. ‘ఇక్కడ దయ్యలు ఉన్నాయనేది ముఢ నమ్మకం. నేను అలాంటి వార్తలను నమ్మను. దయ్యాలు ఉన్నాయన్నది నిజమైతే నేను ఇక్కడ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ పెట్టే వాడినే కాదు. ఎలాంటి భయం లేకుండానే చాలా మంది రోగులు ఇక్కడికి టెస్టులు చేయించుకునేందుకు వస్తున్నారు. నేను ఇక్కడ గణపతి పూజతో పాటు గౌరి పూజలు చేయిస్తాను. అలా చేసిన తర్వాత మళ్లీ చెడు శక్తులు ఉన్నట్లు భావించకుడదని పూజారి నాకు సూచించారు. ఇక్కడ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను నడపడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది’ అని తెలిపారు. 

అలాగే సురేశ్ అనే స్థానికుడు ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘ఆ ఇంట్లో చనిపోయినవారు చాలా మంచివారు. కాబట్టి వారి ఆత్మలు నేరుగా స్వర్గానికి చేరుంటాయి.. ఇక వారు దయ్యలుగా మారే అవకాశం లేదు’ అని అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement