జల్లికట్టు నిషేధానికి క్రికెటర్లు, నటులు మద్దతు | Uphold the ban on Jallikattu, urges actors, cricketers | Sakshi
Sakshi News home page

జల్లికట్టు నిషేధానికి క్రికెటర్లు, నటులు మద్దతు

Dec 15 2015 4:10 PM | Updated on Sep 3 2017 2:03 PM

జల్లికట్టు నిషేధానికి క్రికెటర్లు, నటులు మద్దతు

జల్లికట్టు నిషేధానికి క్రికెటర్లు, నటులు మద్దతు

తమిళనాడులో ఎద్దుల వికృత క్రీడ అయినటువంటి జల్లికట్టును తిరిగి నిర్వహించకుండా చూడాలని అటు బాలీవుడ్ నటులు, ఇటు క్రికెటర్లు కోరుతున్నారు.

చెన్నై: తమిళనాడులో ఎద్దుల వికృత క్రీడ అయినటువంటి జల్లికట్టును తిరిగి నిర్వహించకుండా చూడాలని అటు బాలీవుడ్ నటులు, ఇటు క్రికెటర్లు కోరుతున్నారు.  జల్లికట్టుపై నిషేధంపై జాతీయ అవార్డు గ్రహీత విద్యాబాలన్ తో పాటు, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఓ విజ్ఞాపన పత్రంపై సంతకం చేసి తమ మద్దుతు ప్రకటించారు.  మళ్లీ జల్లికట్టు నిర్వహించకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరుతూ పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్(పెటా) తరపున వారు విన్నవించారు.

గతేడాది ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. జంతువులు సహా జీవులన్నిటికీ సహజసిద్ధమైన గౌరవ మర్యాదలుంటాయని, ప్రశాంతంగా జీవించే హక్కు, తమవారిని రక్షించుకునే హక్కు వాటికుంటాయని పేర్కొంది. వాటిని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement