‘పాక్‌ జవాన్లే నన్ను రక్షించారు’

Two Pakistan Jawans Saved Me Said By Captured Indian Wing Commander Abhinandhan Vardhaman - Sakshi

ఢిల్లీ: తాను కిందపడ్డ సమయంలో అక్కడ చాలా మంది జనం గుమికూడి ఉన్నారని, ఆ గందరళగోళంలో తన పిస్టల్‌ కింద పడిపోయినట్లు పాక్‌ చేతికి చిక్కిన భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్దమాన్‌ తెలిపారు. ఈ మేరకు కొత్తగా విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్‌ అయ్యాయి. నన్ను నేను రక్షించుకోవడానికి పరుగులు తీశానని, అల్లరి మూక తన వెంట పడినట్లు పేర్కొన్నారు.

వాళ్లు చాలా ఆవేశంలో ఉన్నారని, అదే సమయంలో ఇద్దరు పాకిస్తాన్‌ జవాన్లు వచ్చారని, వాళ్లే నన్ను మూక నుంచి రక్షించినట్లు అభినందన్‌ తెలిపారు. తర్వాత వారు తనను వాళ్ల యూనిట్‌కు తీసుకెళ్లారు.. అక్కడే ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నారు.  అక్కడే వైద్య పరీక్షలు కూడా నిర్వహించారని చెప్పారు. నా విషయంలో పాకిస్తాన్‌ ఆర్మీ ప్రొఫెషనల్‌గా వ్యవహరించిందని అభినందన్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top