వాళ్లకు ఇంటర్‌నెట్‌ నిలిపేయండి?! | Trump says cut off internet to terrorists | Sakshi
Sakshi News home page

వాళ్లకు ఇంటర్‌నెట్‌ నిలిపేయండి?!

Sep 15 2017 6:00 PM | Updated on Apr 4 2019 3:25 PM

వాళ్లకు ఇంటర్‌నెట్‌ నిలిపేయండి?! - Sakshi

వాళ్లకు ఇంటర్‌నెట్‌ నిలిపేయండి?!

ఉగ్రవాదులకు, వారికి సహాక సహకారాలు అందిస్తున్న సంస్థలకు తక్షణం ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సాక్షి, వాషింగ్టన్‌ : ఉగ్రవాదులకు, వారికి సహాక సహకారాలు అందిస్తున్న సంస్థలకు తక్షణం ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లండన్‌ ఉగ్రదాడిపై  ఆయన స్పందిస్తూ.. ఇలాంటి దుశ‍్చర్యలకు పాల్పడేవారిని ఏ మాత్రం క్షమించకూడదని అన్నారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అనేది హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఓటమి చెందిన ఒక టెర్రరిస్ట్‌ చేసిన దాడిగా పేర్కొంటే ఆయన ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ ప్రజలను, చిన్నారులను, మహిళలను రక్షించడంలో పోలీసులు విజయం సాధించారని చెప్పారు.

లండన్‌ దాడి తరువాత ఉగ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. అందులో భాంగగా వారి ప్రధాన ఆదాయ, రిక్రూమెంట్‌ వనరు అయిన ఇంటర్‌నెట్‌ సేవలపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటర్‌నెట్‌ సేవలు అందకపోతే.. ఉగ్రవాదులు నీటిలోంచి బయటపడ్డ చేపల్లా విలవిల్లాడతారని చెప్పారు. లండన్‌ ఉగ్రదాడి అనంతరం.. అమెరికా చేసిన ట్రావెల్ బ్యాన్‌ను మరోసారి ట్రంప్‌ సమర్ధించుకున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement