జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, పీడీపీల మధ్య చాన్నాళ్లుగా అనధికారికంగా సాగుతున్న చర్యలు ఇప్పట్లో కొలి క్కి వచ్చేలా కనిపించడంలేదు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, పీడీపీల మధ్య చాన్నాళ్లుగా అనధికారికంగా సాగుతున్న చర్యలు ఇప్పట్లో కొలి క్కి వచ్చేలా కనిపించడంలేదు. కీలకమైన 370 రాజ్యాంగ అధికరణం, సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ).. ఈ రెండింటిపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర లేదు. అయితే, చర్చలు ఫలప్రదంగా కొనసాగుతున్నాయని, కామన్ మినిమమ్ ప్రొగ్రామ్(సీఎంపీ) పత్ర రూపకల్పన తుది దశలో ఉందనిరెండు పార్టీలూ చెబుతున్నాయి.