ఒక్క క్లిక్‌తో నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 9th July 2018 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది. తమకు విధించిన ఉరి శిక్షను రద్దు చేసి, జీవిత ఖైదుగా మార్చాలంటూ నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ఢిల్లీ హైకోర్టు సహా కింద కోర్టులు విధించిన ఉరి శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. దోషులు చేసింది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

నిర్భయ కేసు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిర్భయ కేసులో ముగ్గురు దోషులకు ఉరి శిక్షే సరి అని తీర్పు వెలువరించింది.

ప్రజా సొమ్ము వృథా కూడా అవినీతే!
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ప్రభుత్వం నిధులను భారీగా ఖర్చు చేయడం ఎంత మేరకు భావ్యమని విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడులో అమిత్‌ షాకు చేదు అనుభవం
సాక్షి, చెన్నై : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు తమిళనాడులో ఊహించని షాక్‌ తగిలింది.

తాజ్‌ వద్ద నమాజ్‌ వద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ‘తాజ్‌మహల్‌ ఏడో ప్రపంచ వింత.. కాబట్టి ఇక మీదట అక్కడ వద్ద నమాజ్‌ చేయరాద’ని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నాలుగేళ్లలో బాబు చేసిందేమీ లేదు: కన్నా
సాక్షి, ప్రకాశం: చంద్రబాబు నాలుగేళ్లలో జగన్‌ మోహన్‌ రెడ్డిని, పవన్‌ కల్యాణ్‌ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం : డీజీపీ
సాక్షి, హైదరాబాద్‌ : గత నాలుగేళ్లలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు

అవిశ్వాసం ఆపేయండి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది

భారత్‌ నుంచి ఆ దేశానికే అత్యధిక వలసలు
సాక్షి, న్యూఢిల్లీ : నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలపై ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించిన తాజా నివేదిక

కోహ్లిసేనపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌!
బ్రి‍స్టల్‌ : భారత జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాగన్‌ ఫైర్‌ అయ్యాడు.

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సంజు’
ముంబై: సంజయ్‌ దత్‌ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన సంజు చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top