కోహ్లిసేనపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌!

Michael Vaughan slams Team India - Sakshi

భారత్‌ స్లో ఓవర్‌ రేట్‌ ఇంగ్లండ్‌ కొంప ముంచింది

దీటుగా బదులిస్తున్న భారత అభిమానులు

బ్రి‍స్టల్‌ : భారత జట్టుపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖెల్‌ వాగన్‌ ఫైర్‌ అయ్యాడు. ఆదివారం ఆతిథ్య జట్టుతో జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌ ఓటమికి కోహ్లిసేన స్లో ఓవర్‌ రేటే కారణమని ఈ మాజీ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. దీని కారణంగానే భారత బౌలర్లు చివర్లో చెలరేగి ఇంగ్లండ్‌ను కట్టడి చేశారని తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. 

అయితే ఈ మాజీ కెప్టెన్‌కు భారత అభిమానులు కూడా దీటుగా బదులిస్తున్నారు. ప్రతి బంతి మైదానం బయట పడ్డదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఒకరు కామెంట్‌ చేయగా..  ‘ఇరు జట్ల స్కోర్స్‌ 200 పరుగులు, 8 వికెట్లు దీన్నిబట్టే బంతి చాలసార్లు మైదానం బయటపడిందని, వికెట్ల కోల్పోవడంతో సమయం వృథా అయిందని చెప్పొచ్చు. ఇంగ్లీష్‌ బౌలర్లది ఎలా ఫాస్ట్‌ ఓవర్‌? స్లో ఓవర్‌ రేట్‌ ఎలా ప్రభావితం చేసింది?’  మరొకరు పేర్కొన్నారు. ఓటమికి సాకులు వెతుకోక్కండని ఇంకోకరు అభిప్రాయపడ్డారు. ఇక తొలి టీ20 అనంతరం ఇంగ్లండ్‌ మాజీ క్రికెట్‌ డెవిడ్‌ విల్లే భారత బౌలర్లను తప్పుబట్టిన విషయం తెలసిందే. టీమిండియా బౌలర్లు కీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరి‍స్తున్నారని విల్లే సంచలన కామెంట్స్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top