దేశంలో కొత్తగా ఏర్పడిన ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థల డైరెక్టర్ల నియామకానికి రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా ఏర్పడిన ఐదు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యాసంస్థల డైరెక్టర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌గా కేఎన్.సత్యనారాయణ, పాలక్కాడ్ ఐఐటీ డైరెక్టర్‌గా పీబీ.సునీల్, బిలాయ్– దుర్గ్ ఐఐటీ డైరెక్టర్‌గా ప్రొ.రజత్ మూనా, గోవా ఐఐటీ డైరెక్టర్‌గా బీకే.మిశ్రా, ధార్వాడ్ ఐఐటీ డైరెక్టర్‌గా ప్రొ.శేషు పసుమర్తి ఎన్నికైనట్లు తెలుస్తోంది.
వీరంతా ఐదేళ్ల పాటు డైరెక్టర్లుగా కొనసాగనున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నేతృత్వంలో కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదించిన అభ్యర్థుల జాబితా ఫైలుపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేశారు.