డమ్మీ చెక్లతో కాంగ్రెస్ నిరసన | The fake cheques used by the Congress during a protest in Bengaluru | Sakshi
Sakshi News home page

డమ్మీ చెక్లతో కాంగ్రెస్ నిరసన

Apr 3 2015 1:57 PM | Updated on Mar 29 2019 8:34 PM

డమ్మీ చెక్లతో కాంగ్రెస్ నిరసన - Sakshi

డమ్మీ చెక్లతో కాంగ్రెస్ నిరసన

బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న బెంగళూరు దగ్గర వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

బెంగళూరు: బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న బెంగళూరు దగ్గర వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతకం చేసిన పదిహేను లక్షల రూపాయల డమ్మీ  చెక్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. నల్లధనాన్ని వెలికితీసి భారతదేశంలోని ప్రతీ పౌరుడికి పదిహేనులక్షలు ఇస్తామన్న మోదీ ఎన్నికల వాగ్గానం  ఏమైందంటూ ప్రశ్నించారు.  నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ  ఉద్రిక్త వాతారవణం చోటుచేసుకుంది. ఆందోళన కారులను చెదరగొట్టేందుకు  పోలీసులు  కష్టపడాల్సి వచ్చింది.

బెంగళూరు నగరంలో శుక్రవారం మొదలైన భారతీయ జనతాపార్టీ జాతీయ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ,అధ్యక్షులు  అమిత్ షా, సహా పార్టీ  ఇతర సీనియర్  నాయకులు హాజరయ్యారు.  బెంగళూరులో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement