తరుణ్ తేజ్ పాల్ తల్లి కన్నుమూత
													 
										
					
					
					
																							
											
						 లైంగిక వేధింపుల కేసులో గోవా జైల్లో రిమాండ్ లో ఉన్న హల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ తల్లి శకుంతల తేజ్ పాల్ కన్నుముశారు.
						 
										
					
					
																
	పానాజీ: లైంగిక వేధింపుల కేసులో గోవా జైల్లో రిమాండ్ లో ఉన్న హల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ తల్లి శకుంతల తేజ్ పాల్ కన్నుముశారు. 87 ఏళ్ల శకుంతల గత కొద్దికాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారని.. గోవాలోని తేజ్ పాల్ నివాసంలో కన్నుమూశారని ఆయన తరపు న్యాయవాది సందీప్ కపూర్ మీడియాకు తెలిపారు.
	 
	అంత్యక్రియలకు తేజ్ పాల్ హాజరయ్యేందుకు అనుమతించాలని పానాజీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు తేజ్ పాల్ కు రెండుసార్లు కోర్టు అనుమతించింది.
	 
	శకుంతల అంత్యక్రియలు గోవా లేదా ఢిల్లీలో నిర్వహించాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సందీప్ అన్నారు. సహచర ఉద్యోగిపై అత్యాచారం జరిపారనే ఆరోపణలపై గత సంవత్సరం నవంబర్ 30 తేది నుంచి రిమాండ్ లో ఉన్నారు.