విద్యార్థులతో తృణమూల్ కాంగ్రెస్ ప్రయోగం | Students experiment with the Trinamool Congress | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో తృణమూల్ కాంగ్రెస్ ప్రయోగం

Mar 8 2016 1:20 AM | Updated on Sep 3 2017 7:12 PM

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పార్టీకి అవసరయ్యే సమాచారం అందించేందుకు ఇద్దరు విద్యార్థులను తృణమూల్ కాంగ్రెస్ ఎంపికచేసింది.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పార్టీకి అవసరయ్యే సమాచారం అందించేందుకు ఇద్దరు విద్యార్థులను తృణమూల్ కాంగ్రెస్ ఎంపికచేసింది. రాజకీయ అనుభవం లేని సుమేధ జలోట్, పియూష్ గుప్తాలు... తృణమూల్ ఎంపీలు డెరెక్ ఓబ్రియెన్, సుదీప్ బంద్యోపాధ్యాయ్‌లతో కలసి పనిచేస్తారు.  జలోట్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేయగా, పీయూష్.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. రాష్ట్రాభివృద్ధి, జాతీయ సూచీలకు అనుగుణంగా రాష్ట్రం పనితీరుపై వీరు పార్టీకి నివేదిక ఇస్తారు. ఇతర అభ్యర్థుల ప్రచారం ఎలా ఉందో తెలుసుకుని దాని ఆధారంగా ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చే సూచనలిస్తామన్నారు.

 116 మందితో లెఫ్ట్ కూటమి మొదటి జాబితా
 బెంగాల్ ఎన్నికల కోసం లెఫ్ట్ కూటమి సోమవారం 116 మందితో తొలి జాబితా విడుదల చేసింది. వీరిలో 60మంది తొలిసారి బరిలోకి దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement