ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫీ

Student drowns to death while his friends clicked a selfie

సెల్ఫీల మోజులో పడి, జీవితం విలువను మర్చిపోతున్నారు యువత. ఓ వైపు ఫ్రెండ్‌ ప్రాణం పోతున్నా.. పట్టించుకోకుండా గ్రూఫ్‌ సెల్ఫీ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. జ్ఞాపకార్థం కోసం తీసుకునే ఈ సెల్ఫీ ఫోటోలే, వారికి ఆఖరి క్షణాలుగా మిగులుస్తున్నాయి. ఇదే రకమైన ఓ విషాదకర సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. జయనగర్‌లోని నేషనల్‌ కాలేజీ స్టూడెంట్‌ విశ్వాస్‌ చెరువులో మునిగిపోయాడు. అదే సమయంలో తన స్నేహితులందరూ కలిసి సెల్ఫీ దిగే మోజులో పడిపోయారు.

తన ఫ్రెండ్‌ చెరువులో మునిగిపోతున్న దృశ్యం, వారు సెల్ఫీ తీసుకునే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్నా, వారు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా గ్రూప్‌ సెల్ఫీ పిచ్చిలోనే విహరించారు. ఈ క్రమంలోనే విశ్వాస్‌ చెరువులో మునిగిపోయి మరణించాడు.  విశ్వాస్‌ తన ఎన్‌సీసీ క్యాండెట్లతో కలిసి, రామనగర జిల్లాలోని కనకపుర సమీపంలోని రవగొండలు బెట్టా ప్రాంతానికి పిక్‌నిక్‌కు వెళ్లాడు. వీరు గ్రూప్‌గా తీసుకున్న ఒక సెల్ఫీలో వెనుకవైపు విశ్వాస్‌ కొలనులో మునిగిపోతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top