ఈ భార్య నాకొద్దు బాబోయ్‌! : టెకీ ఆవేదన | Software Engineer Seeks Divorce For Wife Social Media Addiction | Sakshi
Sakshi News home page

ఈ భార్య నాకొద్దు బాబోయ్‌! : టెకీ ఆవేదన

Jun 29 2018 10:37 AM | Updated on Sep 28 2018 4:32 PM

Software Engineer Seeks Divorce For Wife Social Media Addiction - Sakshi

న్యూఢిల్లీ : భార్యతో కలిసి జీవితం పంచుకోలేనని, ఆమె నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కోర్టు మెట్టెక్కారు. ఆ టెకీ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలు చూసి లాయర్లు షాక్‌ అయ్యారు. భార్య ఇంటర్‌నెట్‌ ఎక్కువగా వాడుతోందని తనను ఏమాత్రం పట్టించుకోక పోవడమే విడాకుల దరఖాస్తుకు కారణమని టెకీ పేర్కొన్నాడు. గతంలో గృహహింస, అదనపు కట్నం వేధింపులు లాంటి కారణాలతో విడాకులకు వచ్చేవారని, ప్రస్తుతం సోషల్‌ మీడియా లాంటి వాటి వల్ల దంపతులు విడాకులు కోరడం ఆందోళన కలిగించే విషయమని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ హిమా కోహ్లీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీకి చెందిన నరేంద్ర సింగ్‌(30) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. గతేడాది ఆయన వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన రోజునుంచీ భార్య ఇంటర్నెట్‌ ఎక్కువగా వాడుతూ సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుందని ఈ టెకీ గ్రహంచాడు. కొన్ని రోజులకు మార్పు వస్తుందని భావించగా.. అతడి భార్య సోషల్‌ మీడియాలో మేల్‌ ఫ్రెండ్స్‌తో అర్ధరాత్రిళ్లు చాటింగ్‌ చేయడం నరేంద్ర చూశాడు. ఇలాంటి పనులు మానుకోవాలని తనను, తన కుటుంబ బాధ్యతలు షేర్‌ చేసుకోవాలని కోరగా, టెకీపై భార్య పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగింది. చేసేదేంలేక టెకీ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కాడు. ఈ విషయాలను మెయిల్‌ టుడే మీడియాకు వివరించాడు. 

విడాకుల పిటిషన్‌ను కోర్టు స్వీకరించిందని, వచ్చే నెలలో ఆ దంపతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు నరేంద్ర తరఫు లాయర్‌ మనీష్‌ భాదౌరియా అన్నారు. పెళ్లయ్యాక అత్తవారింటి వాతావరణానికి తగ్గట్లుగా మారే అవకాశం టెకీ ఇవ్వలేదని, తన క్లైయింట్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఇంజినీర్‌ భార్య తరఫు న్యాయవాది తెలిపారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ తర్వాత అసలు నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement