వీకెండ్స్లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి | Smriti to shoot only on weekends? | Sakshi
Sakshi News home page

వీకెండ్స్లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి

Nov 1 2014 1:41 PM | Updated on Sep 2 2017 3:43 PM

వీకెండ్స్లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి

వీకెండ్స్లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి

ప్రముఖ నటీ స్మృతీ ఇరానీ కేంద్రమంత్రి అయిన తర్వాత మహాబిజీ అయిపోయారు. దాంతో ఆమె నటించేందుకు సమయం చిక్కడం లేదు.

ప్రముఖ నటీ స్మృతీ ఇరానీ కేంద్రమంత్రి అయిన తర్వాత మహాబిజీ అయిపోయారు. దాంతో ఆమె నటించేందుకు సమయం చిక్కడం లేదు. దీంతో వీకెండ్స్లో రోజుల్లో మాత్రమే నటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉమేష్ శుక్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆల్ ఈజ్ వెల్. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చెన్ తల్లి పాత్రలో స్మృతీ ఇరానీ నటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే స్మృతీ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు.

అయితే ఎన్నికలైన తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం... అది అత్యంత ముఖ్యమైన శాఖలో ఒకటైనా మానవ వనరుల శాఖను చేపట్టారు. దీంతో స్మృతి నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న హీరో నుంచి లైట్ బాయ్ వరకు చిత్ర యూనిట్ అంతా స్మృతి ఎలా అంటే అలా అని ప్రకటించేశారని సమాచారం. ఆల్ వెల్ చిత్రంలో స్మృతి ఇరానీ భర్తగా రిషి కపూర్ నటిస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement