లైంగిక వేధింపులకు చెక్‌ పెట్టేందుకు ప్రణాళిక | Sexual Assault Center | Community & Human Services | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు చెక్‌ పెట్టేందుకు ప్రణాళిక

Nov 27 2017 3:08 AM | Updated on Nov 27 2017 3:08 AM

Sexual Assault Center | Community & Human Services - Sakshi

న్యూఢిల్లీ: చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాలతో చర్చించి ఓ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్‌ఆర్డీ) శాఖ వెల్లడించింది. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రముఖ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై సహచర విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చెడు స్పర్శకు, ఆత్మీయ స్పర్శకు మధ్య ఉన్న భేదం గురించి పిల్లలకు పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు హెచ్‌ఆర్డీ అధికారి ఒకరు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement