కాంగ్రెస్‌ నేత సజ్జన్‌కుమార్‌ రాజీనామా

Senior Congress leader Former MP Sajjan Kumar resigned - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్‌ రాజీనామా చేశారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగాతేలి శిక్ష పడటంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సోమవారం ఢిల్లీ హైకోర్టు సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 2,733 మంది మృతిచెందిన ఆ ఘటనలో శిక్ష పడిన తొలి రాజకీయ నేత సజ్జన్‌. 1984 నవంబర్‌ 1,2 తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురు సిక్కులను హత్యచేసిన ఘటనలో సజ్జన్‌ పాత్ర నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లలో 2,733 మంది సిక్కులు చనిపోయారు. ఇందిరకి రక్షణగా ఉన్న సిక్కులే ఆమెను హత్య చేయడంతో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top