కేఎం జోసెఫ్‌ వైపే కొలీజియం మొగ్గు..!! | SC Decides To Send Back KM Joseph Name For Elevation | Sakshi
Sakshi News home page

కేఎం జోసెఫ్‌ వైపే కొలీజియం మొగ్గు..!!

May 11 2018 7:11 PM | Updated on May 11 2018 11:46 PM

SC Decides To Send Back KM Joseph Name For Elevation - Sakshi

ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని కొలీజియం శుక్రవారం తీవ్రంగా చర్చించింది. ఇతర న్యాయమూర్తులతో పాటు కేఎం జోసెఫ్‌ను పేరును మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కొలీజియం నిర్ణయించినట్లు సమాచారం. అయితే, ఈ మేరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

గంటపాటు తర్జనభర్జనల అనంతరం కొలీజియంలోని ఐదుగురు న్యాయమూర్తులు జోసెఫ్‌ నియామకంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. కాగా, గత నెలలో జోసెఫ్‌ను న్యాయమూర్తిగా తీసుకోవాలనే కొలీజియం సిఫార్సును కేంద్రం తిప్పి పంపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement