విజయ్ మాల్యా విల్లా స్వాధీనం | SBICAP Trustee takes possession of Vijay Mallya property in Goa | Sakshi
Sakshi News home page

విజయ్ మాల్యా విల్లా స్వాధీనం

May 13 2016 5:05 PM | Updated on Sep 4 2017 12:02 AM

విజయ్ మాల్యా విల్లా స్వాధీనం

విజయ్ మాల్యా విల్లా స్వాధీనం

బ్యాంకులను ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

పణజి: బ్యాంకులను ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. గోవాలో ఆయన భవంతిని బ్యాంకు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. రూ. 90 కోట్లు విలువ చేసే ఈ విల్లాను ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ తన అధీనంలోకి తీసుకుంది. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు ఉత్తర గోవా కలెక్టర్ గురువారం బ్యాంకు అధికారులకు అనుమతి మంజూరు చేశారు. గోవా వచ్చినప్పుల్లా విజయ్ మాల్యా ఈ భవంతిలో బస చేసేవారని, ఇందులో ఎన్నోసార్లు ప్రముఖులకు పార్టీలు ఇచ్చారని స్థానికులు వెల్లడించారు.

రూ.9,000 కోట్ల మేర బ్యాంకింగ్ రుణ ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న విజయ్‌ మాల్యాపై రెడ్ కార్నర్ (అరెస్ట్ వారెంట్) నోటీస్ జారీ చేయాలని  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గ్లోబల్ పోలీస్- ఇంటర్‌పోల్‌కు గురువారం ఒక లేఖ రాసింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని బ్రిటన్ తేల్చి చెప్పడంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement