లెస్బియన్స్‌ డ్యాన్స్‌.. హోటల్‌ సిబ్బంది దారుణం..! | Same Sex Couple Thrown Out Of Chennai Club For Causing Discomfort | Sakshi
Sakshi News home page

లెస్బియన్స్‌ డ్యాన్స్‌.. హోటల్‌ సిబ్బంది దారుణం..!

Aug 2 2019 12:54 PM | Updated on Aug 3 2019 12:45 PM

Same Sex Couple Thrown Out Of Chennai Club For Causing Discomfort - Sakshi

లెస్బియన్స్‌ అనే కారణంతో ఇద్దరు యువతుల పట్ల ఓ హోటల్‌ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారని నెపం మోపి బయటకు గెంటేసింది.

చెన్నై : లెస్బియన్స్‌ అనే కారణంతో ఇద్దరు యువతుల పట్ల ఓ హోటల్‌ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తించింది. ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారని నెపం మోపి బయటకు గెంటేసింది.ఈ ఘటన జూలై 28న చెన్నైలో చోటుచేసుకుంది. తమకు జరిగిన అవమానాన్ని రసికా గోపాలకృష్ణన్‌, శివంగి సింగ్‌ ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. రసికా మాట్లాడుతూ..  ‘తన ప్రెండ్‌ శివంగితో కలిసి  శనివారం అర్ధరాత్రి చెన్నైలోని స్లేట్‌ హోటల్‌ కమ్‌ బార్‌కు వెళ్లాం. మేమిద్దరం కలిసి డ్యాన్స్‌ చేస్తుంటే ఏదో తప్పు చేసినట్టుగా మావైపు ఓ నలుగురు యువకులు అదేపనిగా చూశారు. చాలా ఇబ్బందిగా అనిపించింది. మేం వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు హోటల్‌ బౌన్సర్లు వచ్చి.. లోపల ఏం చేస్తున్నారని, వెంటనే బయటికి రావాలంటూ తలుపులు బాదారు. మీ వల్ల బార్‌లో ఉన్న ఇతరులు అసౌకర్యంగా ఫీలవుతున్నారని అన్నారు. బార్‌ నుంచి తక్షణం బయటికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. అవమానకర రీతిలో బయటికొచ్చాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇబ్బందిగా ఉందన్నారు..
తమను బయటికి ఎందుకు పంపుతున్నారో కారణాలడిగితే.. ‘ మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. అందుకే గెంటేస్తున్నాం. ఈ వెకిలి చర్యలకు సంబంధించిన వీడియో మా దగ్గర ఉంది’ అని సమాధానం చెప్పారని శివంగి వాపోయారు. వీడియో చూపించాలని అడిగితే.. ‘మీకు చూపించాల్సిన అనవసరం లేదు’ అంటూ తప్పించుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి హోటల్‌ సీఈవో యంగ్యా ప్రకాశ్‌ చంద్రన్‌ స్పందించారు. తమ హోటల్‌కు వచ్చే కస్టమర్ల ప్రవర్తనను హోటల్‌ సిబ్బంది, బౌన్సర్లు పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సదరు యువతుల ప్రవర్తన సరిగా లేనందునే బయటికి పంపివేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement