మోదీని ఫాలో అవుతున్న రజనీ

Rajinikanth Following to Narendra Modi in Political Way - Sakshi

రజనీ సోల్జర్స్‌ పేరుతో వెబ్‌సైట్‌కు సన్నాహాలు

చెన్నై: ఒక టీ మాస్టర్‌ స్థాయి నుంచి ప్రైమ్‌మినిస్టర్‌ వరకూ ఎదిగారు నరేంద్రమోదీ. అలాంటిది బస్సు కండక్టర్‌ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌ స్థాయికి ఎదిగిన నటుడు రజనీకాంత్‌ చీఫ్‌మినిస్టర్‌ కావడం సాధ్యం కాదా? ఇది ఆయన అభిమానుల్లో ఉన్న ధీమా.  మరి రజనీకాంత్‌లోనూ ఆ నమ్మకం ఉండబట్టే కథా రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నారు. ఇకపోతే ఈయన ప్రధాని నరేంద్రమోదికి మద్దతుగా మాట్లాడడమే కాదు. ఆయన బాణీలోనూ పయనించడానికి సిద్ధం అవుతున్నారు. ఒక రకంగా రాజకీయాల్లో ఆయన్ని రజనీకాంత్‌ ఆదర్శంగా తీసుకుంటున్నారనే భావించవచ్చు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధానమంత్రి పగ్గాలు పట్టిన రాజకీయ చతురుడు మోది. ఇది రజనీకాంత్‌కు స్ఫూర్తి నిచ్చినట్లుంది. ప్రదానమంత్రి నరేంద్రమోది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ రాజకీయాలకు డిజిటల్‌ సాంకేతక పరిజ్ఞానాన్ని వాడుకున్నారు. వారిద్దరూ సొంతంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకుని ప్రచార సాధనాలుగా వాడుకుంటున్నారు. దీంతో రజనీకాంత్‌ కూడా వారి బాణీలో పయనించడానికి సిద్ధం అవుతున్నారు.

రజనీకాంత్‌ 2021 లో జరగనున్న శాసనసభ ఎన్నికలపై గురి పెడుతున్న విషయం తెలిసిందే. అయితే పార్టీని ప్రారంభించకపోయినా, శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని ప్రారంభించడం ఖాయం అని అంటున్నారు. అందులో భాగంగా తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా మార్చి ఇప్పటికే నిర్వాహకుల నియామకం, సభ్యుల నమోదు, బూ తు కమిటీలు వంటి కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక పార్టీ ప్రకటనే తరువాయి అనంతగా రజనీ ప్రజా సంఘాలు ఉన్నాయి. కాగా ఇటీవల చెన్నైలో మంచి నీటి ఎద్దడి పెరిగిన విషయం తెలిసిందే. దీంతో రజనీకాంత్‌ అభిమానులు పలు ప్రాంతాల్లో ట్రాక్టర్లు, లారీలతో నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చారు.అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించినా, ఈ సారి వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగమేనని ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు.

డిజిటల్‌ వెబ్‌సైట్‌కు సన్నాహాలు
ఇలాంటి పరిస్థితుల్లో  రజనీకాంత్‌ ప్రధాని నరేంద్రమోదిని అనుసరించే విధంగా రజనీ సోల్జర్స్‌ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి ఆయన ప్రజా సంఘాల నిర్వాహకులు తెలుపుతూ రజనీ సోల్జర్స్‌ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంబించి తద్వారా రజనీ కాంత్‌కు సంబంధించిన కార్యక్రమాల ను, ఆయన అభిప్రాయాలు వంటి ప లు విషయాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా రజనీకాంత్‌ గురించి ప్రచారం అవుతున్న మీమీస్‌ వంటి వాటిని తిప్పి కొట్టడం, ప్రజా బలాన్ని పెంచుకోవడం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపా రు. వెబ్‌సైట్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నట్లు చెప్పారు. ఇటీవల వెబ్‌సైట్‌కు సంబంధించి సాం కేతిక నిపుణులతో సమావేశం అయ్యి చర్చించినట్లు తెలిపారు. ఇప్పటి వర కూ రాష్ట్ర,కేంద్ర రాజకీయాలపై తనదైన బాణీలో స్పందిస్తూ వస్తున్న రజనీ కాంత్‌ పెద్దగా వివాదాల్లో చిక్కుకోకపోయినా, ఇటీవల కశ్మీర్‌ విషయంలో మోది తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన రజనీకాంత్‌ పెద్ద వివాదానికి తెరలేపారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడానికి సిద్ధం అవుతున్న మోది బాణీని అనుసరించి విజయం సాధిం చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రజనీ వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ
కాగా కశ్మీర్‌ వ్యవహారంలో కేంద్రప్రభుత్వ చర్యల్ని సమర్థించిన రజనీకాంత్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వసంతకుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఈయ న సోమవారం నెల్‌లైలో మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్‌ వ్యవహారంలో కేం ద్రప్రభుత్వ నిర్ణయాన్ని రజనీకాంత్‌  స్వాగతించడం, గర్హనీయంగా పేర్కొన్నారు. రజనీకాంత్‌ చరిత్రనెరిగి మాట్లాడాలని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ స భ్యుడు వసంత్‌కుమార్‌ అన్నారు.కాగా నటుడు విజయ్‌సేతుపతి కశ్మీర్‌లో 370 రద్దును వ్యతిరేకించారు. ఆ ప్రాంత ప్రజలకనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండాలనే అభిప్రాయాన్ని విజయ్‌ సేతుపతి ఒక భేటీలో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top