కూలీ మెడను చుట్టేసిన కొండచిలువ

Python Coils Around Kerala Man Neck Rescued By Co Workers - Sakshi

తిరువనంతపురం : పొదల్లో చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తున్న కూలీలకు కొండచిలువ భయానక అనుభవాన్ని మిగిల్చింది. అమాంతం ఓ కూలీ మెడను చుట్టేసి అతడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఘటన తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాలు.. నెయ్యార్‌ డ్యామ్‌ పరిసరాల్లో చెత్తను శుభ్రం చేయడానికి కొంతమంది కూలీలు మంగళవారం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో భువనచంద్రన్‌ నాయర్‌ అనే వృద్ధుడికి అక్కడ కొండచిలువ కనిపించింది. దీంతో నెమ్మదిగా దానిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. అది ఒక్కసారిగా అతడి మెడను చుట్టేసింది. అంతకంతకు పట్టు బిగిస్తూ అతడి ప్రాణం తీసేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో అక్కడికి సమీపంలో పనిచేస్తున్న మరికొంత మంది కూలీలు నాయర్‌ పరిస్థితి చూసి బెంబేలెత్తిపోయారు. అనంతరం ధైర్యం కూడదీసుకుని కొండచిలువ మూతి బిగించి ఎలాగోలా దానిని నాయర్‌ మెడపై నుంచి లాగి పడేశారు. అనంతరం దానిని అటవీ అధికారులకు అప్పగించగా.. వారు అడవిలో వదిలేశారు. కాగా ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top