‘పాపం.. అతడి తెలివే చలానా కట్టేలా చేసింది’

Pune Police Reacted On Crown Number Plate In Social Media - Sakshi

ఓ వ్యక్తి ట్విటర్‌లో ద్విచక్ర వాహనం నెంబరు ప్లేటును షేర్‌ చేస్తూ.. పుణె ట్రాఫిక్‌ పోలీసులను ట్యాగ్‌ చేశాడు. ఇందుకు ఓ పోలీసు అధికారి చమత్కారంగా స్పందించి.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. వివరాలు... పుణేకు చెందిన పంకజ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న తెలుపు రంగు స్కూటీ నెంబర్‌ ప్లేటుపై.. కిరీటం ఉన్న స్టిక్కర్‌ను గుర్తించి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి ‘ ఈ స్కూటీ యజమానికి ఉన్న అతి తెలివి.. పాపం ఆయనను త్వరలోనే చలాన కట్టేలా చేసింది’ అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు రాగా.. వందల్లో కామెంట్లు వస్తున్నాయి.

కాగా మోటారు వాహన చట్టం- 1988, కేంద్ర మోటారు వాహన చట్టం 1989లోని నిబంధనల ప్రకారం.. నెంబరు ప్లేటుపై రిజిస్ట్రేషన్‌ నెంబరు తప్ప మరేమీ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా బొమ్మలు కానీ ఇతరత్రా గుర్తులు ఉంటే నిబంధనల ఉల్లంఘన కింద వారి మీద చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే సదరు పోలీసు అధికారి పైవిధంగా స్పందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top