రోడ్డు కోసం తవ్వుతుండగా లంకెబిందె దొరికింది!! | Pot With Gold Coins Unearthed During Road Works | Sakshi
Sakshi News home page

రోడ్డు కోసం తవ్వుతుండగా లంకెబిందె దొరికింది!!

Jul 14 2018 3:37 PM | Updated on Jul 14 2018 7:46 PM

Pot With Gold Coins Unearthed During Road Works - Sakshi

బంగారు నాణెలు

రోడ్డు నిర్మాణ పనుల్లో లంకెబిందె బయటపడింది.

రాయ్‌పూర్‌ : రోడ్డు నిర్మాణ పనుల్లో లంకెబిందె బయటపడింది. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని కొండగావ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ మహిళా కూలీ తవ్వకాలు జరుపుతుండగా బంగారు నాణెలతో కూడిన లంకెబిందె దొరికింది. అందులో 57 బంగారు నాణెలు, ఒక వెండి నాణెం, ఓ బంగారు చెవిపోగు లభ్యమైనట్లు జిల్లా కలెక్టర్‌ నీలకంఠ్‌ తెలిపారు.

కోర్‌కోటి, బెడ్మా గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం జరుగుతుండగా లంకెబిందె దొరికిందని చెప్పారు. నాణెలు అన్నీ 12-13 శతాబ్దాలకు చెందినవిగా వెల్లడించారు. నాణెలపై ఉన్న లిపిని బట్టి యాదవుల కాలానికి చెందినవిగా తెలుస్తోందని వివరించారు. మహారాష్ట్రలోని విదర్భ కేంద్రంగా యాదవులు పాలించారు. ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్‌ను కూడా ఆక్రమించారు. రాష్ట్ర పురావస్తు పరిశోధకులు నాణెలను మరింత పరిశోధిస్తారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement