
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాను చేసే ప్రసంగానికి సంబంధించి ఆలోచనలు, సూచనలు ఇవ్వాల్సిందిగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రకోట బురుజుపై నుంచి తాను చేసే ప్రసంగం ద్వారా మీ ఆలోచనలను 130 కోట్ల మంది వింటారని ఆయన అన్నారు. నమో యాప్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ ఫోరానికి సలహాలు, అభిప్రాయాలు పంపాలని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా పంద్రాగస్టు ప్రసంగానికి సూచనలు కోరుతున్న సంగతి తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మోదీ పాల్గొననున్న మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇవే.