‘కాషాయ కూటమిదే విజయం’

Piyush Goyal Says Opposition Nowhere In Contest - Sakshi

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షం రేస్‌లో లేదని బీజేపీ-శివసేన కూటమి ఘనవిజయం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తమ కూటమి దాదాపు 225 స్ధానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశారు. విపక్షం ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ల నాయకత్వం పట్ల సంతృప్తితో ఉన్నారని చెప్పారు. మహారాష్ట్ర, హర్యానా ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని, దేశ పురోగతి, భద్రత కోసం ఓటు వేయాలని కోరారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ స్ధానాలు, రెండు లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలకు పోలింగ్‌ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతోంది.కాగా, అక్టోబర్‌ 24న మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top