45 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు రద్దు

Passports Of 45 NRIs Cancelled For Abandoning Wives - Sakshi

న్యూఢిల్లీ: భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై కొరడా ఝుళిపించినట్లు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులను రద్దుచేసినట్లు వెల్లడించారు. కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్‌ శ్రీవాత్సవ నేతృత్వంలో సమీకృత నోడల్‌ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు.

మహిళలకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును తాము తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1967 నాటి పాస్‌పోర్ట్‌ చట్టం, 1973 నాటి క్రిమినల్‌ ప్రొసిజర్‌లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయని వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top