ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం | Padma Awards programme | Sakshi
Sakshi News home page

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Mar 30 2015 12:21 PM | Updated on Aug 29 2018 9:08 PM

ఈ ఏడాదికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవం సోమవారం న్యూఢిల్లీలో జరిగింది.

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవం సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్‌లో
ఘనంగా నిర్వహించిన ప్రదానోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాల్లో కృషిచేసిన వారికి ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను అందజేశారు.  
మొత్తం 104మందికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. 20మందికి పద్మభూషణ్,  9మందికి పద్మవిభూషణ్, 75 మందికి పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. 

 పండిత్‌ మదన్‌మోహన్‌ మాలవీయ  కుటుంబ సభ్యులకు భారతరత్న అవార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బహుకరించారు. మదన్‌ మోహన్‌ మాలవీయ తరపున ఆయన మనవరాలు హేమ్‌ శర్మ, మనవడి భార్య సరస్వతీ మాలవీయ, మనవలు ప్రేమ్‌ధర్‌ మాలవీయ, గిరిధర్‌ మాలవీయ బహుమానాన్ని అందుకున్నారు.  పౌర పురస్కారాల్లో రెండో అత్యున్నత పద్మ విభూషణ్‌ను  రాష్ట్రపతి- బీజేపీ అగ్రనేత లాల్‌ కృష్ణ అద్వానీకి అందజేశారు.

 

ప్రజాక్షేత్రంలో అత్యున్నత సేవలందించినందుకు అద్వానీకి పద్మవిభూషణ్‌ పురస్కారం బహుకరించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ కూడా పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. వైద్య విభాగంలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మంజుల అనగాని,  క్రీడా విభాగంలో షట్లర్‌ సింధు పద్మశ్రీ అందుకున్నారు.


ఈ అవార్డులు అందుకున్న ఆరుగురు తెలుగు వారు..
మిథాలీ రాజ్
పీవీ సింధు
కోటా శ్రీనివాసరావు
నోరి దత్తాత్రేయుడు
రఘురామ్
డాక్టర్ ఎ.మంజుల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement