జైలులో ఖైదీలకు పాము కాట్లు  | One Killed By Snake Bite In Lucknow District Jail | Sakshi
Sakshi News home page

జైలులో ఖైదీలకు పాము కాట్లు 

Aug 14 2019 6:11 PM | Updated on Aug 14 2019 6:22 PM

One Killed By Snake Bite In Lucknow District Jail - Sakshi

దీంతో జీవితఖైదు అనుభవిస్తున్న బబ్బు మరణించగా మిగిలిన...

లక్నో : జిల్లా జైలులో ముగ్గురు ఖైదీలు పాము కాటుకు గురైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వీరిలో ఒకరు మృత్యువాతపడగా మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌  రాష్ట్రమంతటా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లక్నో జిల్లా జైలు మొత్తం నీటితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో వరద నీటికి కొట్టుకువచ్చిన పాములు అక్కడి ఖైదీలు బబ్బు, దిలీప్‌, రాజ్‌ కుమార్‌లను కాటు వేశాయి. దీంతో జీవితఖైదు అనుభవిస్తున్న బబ్బు మరణించగా  మిగిలిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

వారి పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీనిపై జైలర్‌ సతీష్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘జైలు ఆవరణంలో సంచరిస్తున్న పాములను పట్టుకోవటానికి పాములను పట్టేవారిని పిలిపించాము. వారు నాలుగు పాములను పట్టుకున్నార’’ని వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement