
తగ్గిన పెట్రోల్ ధర, లీటర్ పై 75 పైసలు తగ్గింపు!
పెట్రోల్ ధరను తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
పెట్రోల్ ధరను తగ్గిస్తూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 75 పైసలు తగ్గిస్తూ చమురు కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. డీజిల్ ధరలో ఎలాంటి మార్పులు ఉండవని చమురు కంపెనీ నిర్వహకులు ప్రకటనలో వెల్డడించారు. తగ్గిన పెట్రోల్ ధర సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. తగ్గిన ధర ప్రకారం మెట్రో నగరాలైన ఢిల్లీలో 72.26, కోల్ కతాలో 80.13, ముంబైలో 80.89, చెన్నై లో 75.49 ఉంటాయని చమురు కంపెనీలు తెలిపాయి.