ఒడిశా సాంకేతిక సలహాదారుగా పిట్రోడా | Odisha appoints Sam Pitroda its technology advisor | Sakshi
Sakshi News home page

ఒడిశా సాంకేతిక సలహాదారుగా పిట్రోడా

Published Wed, Jan 6 2016 6:57 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

జాతీయ విజ్ఞాన కమిషన్ మాజీ చైర్మన్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు శామ్ పిట్రోడా ఒడిశా ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు.

భువనేశ్వర్: జాతీయ విజ్ఞాన కమిషన్ మాజీ చైర్మన్, ప్రధానమంత్రి మాజీ సలహాదారు శామ్ పిట్రోడా ఒడిశా ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. 'శామ్ పిట్రోడాను ఒడిశా ప్రభుత్వ సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2036 విజన్ ఒక రూపం సంతరించుకోబోతోంది' అని ట్వీట్ చేశారు.

శామ్ పిట్రోడాకు రాష్ట్ర కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. ఒడిశా ప్రభుత్వం చేపట్టిన విజన్ 2036 కోసం ఆయన పనిచేయనున్నారు. ఒడిశాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో విజన్ 2036 డాక్యుమెంట్ ను ఇటీవల నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement