వైమానిక దళ మాజీ అధిపతి త్యాగి విషయంలో సీబీఐ చట్టాన్ని అతిక్రమించిందని ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
ఢిల్లీ: వైమానిక దళ మాజీ అధిపతి త్యాగిఈ విషయంలో సీబీఐ చట్టాన్ని అతిక్రమించిందని ఆయన తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అగస్టా కుంభకోణానికి సంబంధించి త్యాగిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు బుధవారం ఆయన సోదరులను పాటియాల కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా త్యాగి తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చట్టాన్ని అతిక్రమించిన సీబీఐ.. హైకోర్టు నిబంధనలు కూడా పాటించలేదని ఆరోపించారు.
దర్యాప్తు పూర్తికాకుండానే త్యాగిని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. దీనిపై స్పందించిన సీబీఐ తరుపు న్యాయవాది ఈ కేసు అంతర్జాతీయంగా ప్రభావం ఉన్నదని, త్యాగికి వ్యతిరేకంగా గట్టి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. మరోపక్క, త్యాగి కస్టడీని మరో మూడు రోజులు పొడిగించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. దీంతో మరోసారి ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు.