జీఎస్‌టీ సాధికార కమిటీ కొత్త చైర్మన్ మణి | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ సాధికార కమిటీ కొత్త చైర్మన్ మణి

Published Thu, Mar 26 2015 1:15 AM

new chairman of the Empowered Committee of GST

న్యూఢిల్లీ: వస్తు సేవ ల పన్ను (జీఎస్‌టీ) వ్యవహా రాల రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ చైర్మన్‌గా కేఎం మణి నియమితులయ్యారు. కేరళ ఆర్థికశాఖ సహా న్యాయ, గృహ వ్యవహారాల శాఖల మంత్రిగా కూడా మణి విధులు నిర్వహిస్తున్నారు.  కొత్త పరోక్ష పన్ను వ్యవస్థగా ఆవిర్భవిస్తున్న జీఎస్‌టీ ‘అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే’ 2016 ఏప్రిల్ నుంచి దేశంలో అమల్లోకి వస్తుందని అంచనా. ఈ పన్ను విధానాల కు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను, ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయడానికి రాష్ట్ర ఆర్థిక మంత్రులతో ఏర్పాటయ్యిందే జీఎస్‌టీ సాధికార కమిటీ. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృత చర్చల తర్వాత ఈ నియామకం జరిగిందనిఆర్థిక శాఖ తెలిపింది.


నేపథ్యం: జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అబ్దుల్ రహీమ్ రత్తేర్ జీఎస్‌టీ చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఎన్‌సీ ఓటమి నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎంపిక అవసరం ఏర్పడింది. చైర్మన్ పదవికి సాధారణంగా ప్రతిపక్ష పాలక రాష్ట్ర ఆర్థికమంత్రి నియమితులవుతుంటారు. మణి కేరళకాంగ్రెస్ (ఎం)కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో సైతం ఆయనకు అపార అనుభవం ఉంది.

Advertisement
Advertisement