రాంబో బాణాలు.. రాకెట్‌ బాంబులు

Naxalites armoury reloaded with Rambo arrows, rocket bombs - Sakshi

న్యూఢిల్లీ: భద్రతా దళాలపై దాడులు చేయడం కోసం నక్సలైట్లు సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. రాంబో బాణాలు, రాకెట్‌ బాంబులు వంటి ఆధునిక, ప్రాణాంతక సామగ్రితో భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నారు. ఈ మేరకు వామపక్ష తీవ్రవాద శిబిరంలో నెలకొన్న ధోరణులపై అధ్యయనం చేసిన ఉమ్మడి భద్రతా దళం (జేఎస్సీ) తాజా నివేదిక వెల్లడించింది. భద్రతా బృందాలకు చెందిన స్నిఫర్‌ డాగ్స్‌ను ఏమార్చేందుకు మావోయిస్టులు ముడి బాంబులను జంతువుల మలంలో దాచేస్తున్నారని తెలిపింది.

2017 తొలి త్రైమాసికంలో భద్రతా దళాల స్నిఫర్‌ డాగ్స్‌ ఈ కారణంగానే గాయపడటం లేదా మృతి చెందాయంది. నక్సల్స్‌ దాడులకు ఉపయోగించే సరికొత్త పద్ధతుల్లో ప్రముఖమైంది.. పేలుడు పదార్థంతో కూడిన రాంబో బాణం అని పేర్కొంది. గన్‌ పౌడర్‌ లేదా మందుగుండు కలిగిన ఆ బాణం లక్ష్యాన్ని తాకగానే పేలుతుంది. రాంబో బాణాలు ఎక్కువ నష్టాన్ని కలిగించకపోయినా భద్రతా సిబ్బందిలో ఆందోళన కలిస్తాయని.. తద్వారా దాడి చేయడానికి మావోలకు ఉపయోగపడతాయంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top