ఆ రెండు కేసుల్లో లాలూకు బెయిల్‌

Lalu Prasad Gets Bail But Will Remain In Jail - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు గురువారం ఢిల్లీ కోర్టు వచ్చే ఏడాది జనవరి 19 వరకూ మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. సీబీఐ, ఈడీ దాకలు చేసిన రెండు ఐఆర్‌సీటీసీ కేసుల్లో లాలూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లాలూకు బెయిల్‌ లభించినా పశుగ్రాస కుంభకోణం కేసులకు సంబంధించి లాలూ రాంచీ జైలులోనే శిక్ష అనుభవించనున్నారు.

ఐఆర్‌సీటీసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ రాంచీ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో ప్రత్యేక న్యాయమూర్తి అరుణ్‌ భరద్వాజ్‌ లాలూ ప్రసాద్‌కు బెయిల్‌ మంజూరు చేశారు.

ఈ రెండు కేసుల్లో బెయిల్‌ కోరుతూ లాలూ చేసుకున్న దరఖాస్తులపై బదులివ్వాలని సీబీఐ, ఈడీలను కోర్టు ఆదేశించింది. ప్రైవేట్‌ సంస్థకు రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టును కట్టబెట్టడంలో లాలూ అక్రమాలకు పాల్పడ్డారని ఈ కేసులో ఆయనపై దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top