
శబరి ఆలయంలో యువతి!
శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ఒక యువతి ఫొటో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.
తిరువనంతపురం: మహిళలకు ప్రవేశం లేని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ఒక యువతి ఉండగా తీసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవాదాయ అధికారులకు ఆ ఫొటో నిష్పాక్షితను నిర్ధారించాలని ఆదేశించారు. మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ.. ఈ విషయమై కొల్లాంకు చెందిన వ్యాపారవేత్త ఒకరు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ముఖ్యంగా 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం నిషేధం.