ఏపీకి కార్మిక ట్రిబ్యునల్ | labor tribunal to the AP | Sakshi
Sakshi News home page

ఏపీకి కార్మిక ట్రిబ్యునల్

Mar 23 2016 4:19 AM | Updated on Sep 3 2017 8:20 PM

ఏపీకి కార్మిక ట్రిబ్యునల్

ఏపీకి కార్మిక ట్రిబ్యునల్

విభజన జరిగిన రాష్ట్రాల్లో కార్మిక ట్రిబ్యునళ్లు లేవని, ప్రతిపాదనలు వస్తే వాటి ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

ప్రతిపాదనలు పంపితే ఏర్పాటుకు సిద్ధం: దత్తాత్రేయ

 సాక్షి, న్యూఢిల్లీ: విభజన జరిగిన రాష్ట్రాల్లో కార్మిక ట్రిబ్యునళ్లు లేవని, ప్రతిపాదనలు వస్తే వాటి ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్మికుల కేసుల పరిష్కారమై మంగళవారం ఆయన సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విభజన అనంతరం బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ట్రిబ్యునళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు పంపాలని లేఖ రాయనున్నట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement