కేజ్రీవాల్‌కు ఝలక్‌.. కీలక నేత బీజేపీలోకి.. | Kumar Vishwas may join BJP | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు ఝలక్‌.. కీలక నేత బీజేపీలోకి..

Jan 18 2017 9:24 AM | Updated on Mar 29 2019 9:31 PM

కేజ్రీవాల్‌కు ఝలక్‌.. కీలక నేత బీజేపీలోకి.. - Sakshi

కేజ్రీవాల్‌కు ఝలక్‌.. కీలక నేత బీజేపీలోకి..

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు సొంతపార్టీ నేత కుమార్‌ విశ్వాస్‌ ఝలక్‌ ఇవ్వనున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు సొంతపార్టీ నేత కుమార్‌ విశ్వాస్‌ ఝలక్‌ ఇవ్వనున్నారు. పార్టీలో అత్యంత నమ్మకస్తుడిగా ఉంటున్న ఆయన త్వరలోనే కమలదలం(బీజేపీ)లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయనకు బీజేపీకి మధ్య చర్చలు దాదాపు పూర్తి కావొచ్చని, బీజేపీలోకి అడుగుపెడుగుతున్న విషయంపై ఆయన ఏ సమయంలోనైనా అధికారికంగా ప్రకటించవచ్చని సమాచారం.

విశ్వాస్‌ కుమార్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సహిబాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. విశ్వాస్‌తో చర్చలు ఇప్పటికే చాలా ముందుకెళ్లాయని, ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌కు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఇక నిర్ణయం కూడా త్వరగానే వెలువడనుందని బీజేపీ వర్గాల సమాచారం. అంతేకాదు.. త్వరలోనే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాతో కుమార్‌ విశ్వాస్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. గతంలో కుమార్‌ విశ్వాస్‌ అమేథీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరుపున రాహుల్‌గాంధీ, స్మృతి ఇరానీపై పోటీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement