ట్రంప్‌కు ‘తాజ్‌’ను చూపించింది ఎవరో తెలుసా?

Know More About Taj Mahal Guide Nitin Singh - Sakshi

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియాలు తాజ్ మహల్‌ అందాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. వారు తాజ్ అందాలను వీక్షిస్తున్న సమయంలో గైడ్‌గా నితిన్ కుమార్‌ సింగ్ వ్యవహరించారు. ఆయన ట్రంప్‌కే కాకుండా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు, ఇతర ప్రముఖులకు తాజ్ గొప్పతనాన్ని వివరించి చూపారు. ఆగ్రాలోని కట్రా ఫులెల్‌కు చెందిన నితిన్ తాజ్ మహల్ ఘనతను, దాని వెనుకనున్న ప్రేమ కథను ట్రంప్‌కు వివరించారు. ఈ సందర్భంగా ట్రంప్, మెలానియాలు అతను చెబుతున్నదానిని శ్రద్ధగా విన్నారు. దీనిపై నితిన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ దంపతులు తాజా మహల్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారన్నారు. అదొక అద్భుత కట్టడం అని ట్రంప్‌ దంపతులు పేర్కొన్నట్లు నితిన్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. మరొకసారి తాజ్‌ మహల్‌ను వీక్షించడానికి వారు వస్తామని తెలిపారన్నారు.

గతంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్మాగిన్ బతుల్గా, బెల్జియం రాజు ఫిలిప్‌లకు తాజ్ మహల్‌ గురించి వివరించిన ఘనత నితిన్‌ కుమార్‌ సింగ్‌ది. ప్రధాన నరేంద్ర మోదీకి ఎంతో ఇష్టమైన నితిన్‌ సింగ్‌.. ఎక్కువ శాతం ప్రముఖులకే గైడ్‌గా వ్యవహరిస్తారు. ఆగ్రాకు చెందిన నితిన్‌ సింగ్‌ తాజ్‌ మహల్‌ విశిష్టత గురించి తెలపడంలో అతనికే అతనే సాటని స్థానికుల మాట. (ఇక్కడ చదవండి: చేతిలో చెయ్యేసి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top