పాఠశాల వార్షికోత్సవాల్లో సినిమా పాటలపై నిషేధం

Karnataka To Ban On Movie Songs And Dances Ban In School Annual Day - Sakshi

కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం

బెంగళూరు: విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించే దిశగా కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల వార్షికోత్సవాల్లో సినిమా పాటల డ్యాన్సులపై నిషేధం విధించింది.  ఈమేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొన్ని సినిమా పాటల నృత్యాలు అశ్లీలంగా ఉంటున్నాయన్న తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 

పాఠశాల వార్షికోత్సవాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఇకపై ముందుగా విద్యాశాఖకు తెలియచేయాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి ఒకవేళ సినిమా నృత్యాలకు అవకాశం కల్పిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. విద్యాశాఖ నిర్ణయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా... సినీ వర్గాలు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలులోకి తీసుకురావాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తుంది. 

వయసుకు, ఆలోచనలకు సంబంధంలేని పాటలు
ఈ విషయమై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ ‘‘ఈ మధ్యే నేను ఓ స్కూలులో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రదర్శన కోసం విద్యార్థులు ఎంచుకున్న పాటల్ని విని ఆశ్చర్యపోయాను. అన్ని సినిమా పాటలే ఉన్నాయి. అది కూడా వారి వయసుకు, ఆలోచనలకు సంబంధం లేని పాటలు. ఇలాంటి పాటల వల్ల వారికి చాలా ప్రమాదముందని భావించాను’’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top