పుల్వామాలో కొనసాగుతున్న కాల్పులు | Jammu and Kashmir: Encounter between terrorists, security forces underway in Pulwana | Sakshi
Sakshi News home page

పుల్వామాలో కొనసాగుతున్న కాల్పులు

Jan 20 2016 9:39 AM | Updated on Sep 3 2017 3:59 PM

పుల్వామాలో కొనసాగుతున్న కాల్పులు

పుల్వామాలో కొనసాగుతున్న కాల్పులు

దక్షిణ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో తీవ్రవాదులకు... భద్రత దళాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుందని సైనిక అధికారులు బుధవారం వెల్లడించారు.

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో తీవ్రవాదులకు... భద్రత దళాలకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుందని సైనిక అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లాలోని నైనా బాటాపొరా గ్రామంలో తీవ్రవాదులు దాగి ఉన్నారని మంగళవారం సాయంత్రం భద్రత దళాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు గ్రామానికి చేరుకున్న భద్రత దళాలు తనిఖీలు నిర్వహించాయి.

ఆ విషయాన్ని గమనించిన... తీవ్రవాదులు... భద్రత దళాలపైకి కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రత దళాలు... ఎదురు కాల్పులకు దిగారు. ఆ క్రమంలో ఇరువైపులా కాల్పులు బుధవారం ఉదయం కూడా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. అయితే ఇరువైపులా ఎవరికి ఎటువంటి గాయాలు జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement