‘ఉగ్ర ప్రకటన’పై భారత్, అమెరికా చర్చలు | India-US hold first meet on designations of terrorists, groups | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర ప్రకటన’పై భారత్, అమెరికా చర్చలు

Dec 20 2017 2:50 AM | Updated on Apr 4 2019 3:25 PM

India-US hold first meet on designations of terrorists, groups - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలు, వ్యక్తులను అధికారికంగా ప్రకటించేందుకు భారత్, అమెరికాల మధ్య జరిగిన తొలి సమావేశం సోమవారం ముగిసింది. ఉగ్రముప్పు ఎదుర్కోవడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి భారత్‌ తరఫున విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. అమెరికా నుంచి హోంల్యాండ్‌ అధికారులు పాల్గొన్నారు. ఉగ్ర సంస్థలు, వ్యక్తులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదులుగా ముద్రవేసే విధానాలపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. తదుపరి రౌండ్‌ సమావేశం 2018లో అమెరికాలో జరుగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement