69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా పండుగలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ : 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా పండుగలో పాల్గొన్నారు. ఆయన శనివారం ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించి... గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు సిబ్బందిని స్వీట్స్ ఇచ్చి స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ కూడా ఢిల్లీలోని తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, గౌరవ వందనం చేశారు.
అలాగే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ శనివారం ఉదయం జాతీయ జెండా ఆవిష్కరించారు.