నేనిప్పుడు బేబి @ 60 : జస్టిస్‌ జోసెఫ్‌ | I feel like a baby again, says Justice KM Joseph | Sakshi
Sakshi News home page

నేనిప్పుడు బేబి @ 60 : జస్టిస్‌ జోసెఫ్‌

Published Wed, Aug 15 2018 2:30 AM | Last Updated on Sun, Sep 2 2018 5:36 PM

I feel like a baby again, says Justice KM Joseph  - Sakshi

న్యూఢిల్లీ: ‘60 ఏళ్ల వయసులో నేను మళ్లీ బేబీ అయ్యాను’ అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. జడ్జిగా ఇటీవల ప్రమాణం చేయడానికి ముందు ప్రభుత్వం ఆయన సీనియారిటీని కుదించడం తెల్సిందే. ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిల్లో సీనియారిటీ ప్రకారం ఆయన 25వ స్థానంలో నిలిచారు.

కొత్తగా సుప్రీం జడ్జీలుగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ ఇందూ మల్హోత్రా, జస్టిస్‌ జోసెఫ్, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లకు మంగళవారం సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్‌ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ జోసెఫ్‌ మాట్లాడారు.‘కోర్టులో 25వ సీనియర్‌ జడ్జీగా 60 ఏళ్ల వయసులో మళ్లీ బేబీ అయ్యాను’ అని అన్నారు. తాను జడ్జిగా పదోన్నతి పొందినపుడు టీ ఇచ్చి సరిపుచ్చారని, కానీ ఇప్పుడు ఘనంగా సత్కరిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement