ఎనిమిది మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

Howrah And New Delhi Poorva Express derails near Kanpur - Sakshi

లక్నో : హౌరా - న్యూఢిల్లీ పూర్వ ఎక్స్‌ప్రెస్‌ శనివారం పట్టాలు తప్పింది. కాన్పూర్‌ పట్టాణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. హౌరా నుంచి ఢిల్లీ వెళ్తున్న పూర్వా ఎక్స్‌ప్రెస్.. కాన్పూర్ జిల్లాలోని రూమ రైల్వే స్టేషన్‌ సమీపంలో శనివారం ఉదయం 12.54 గంటలకు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పగా.. అందులో నాలుగు పూర్తిగా బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభంవించలేదని.. ఓ ఎనిమిది మంది ప్రయాణికులకు మాత్రం తీవ్ర గాయాలయ్యానని అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిని వెంటనే సమీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 900 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. వీరిని తరలించేందుకు ప్రత్యేక రైళ్లు, బస్సులు వినియోగిస్తున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక పోలీసు బలగాలు, వైద్య సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సేవలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top